దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్యం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. అయితే ఇటీవలే రామ్ చరణ్ జిమ్‌లో గాయపడడం, ఎన్టీఆర్ చెయ్యి కి సైతం బెణుకు నొప్పులు ఉండటంతో కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, మిగతా పనులు చక్కబెడుతోంది యూనిట్. కాగా ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఆగస్టు 15న చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు ఓ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది.
స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో జరిగే కథ కావడంతో, స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగష్టు 15నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయటం సమంజసంగా ఉంటుందని తండ్రి విజయేంద్ర ప్రసాద్ సలహా మేరకు రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa