'నానుమ్ రౌడీ దాన్' సినిమా విజువల్స్‌ను 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ధనుష్ నిర్మాణసంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయన్ దంపతులతోపాటు రౌడీ పిక్చర్‌పై దావా వేసింది. దీనిపై నయనతార లాయర్ స్పందిస్తూ.. డాక్యుమెంటరీలో ఉపయోగించిన విజువల్స్ సినిమాలోవి కావు. అవి బీటీఎస్‌కు సంబంధించినవి. వ్యక్తిగత లైబ్రరీలో భాగం. కాబట్టి అది ఉల్లంఘన కిందకు రాదని అన్నారు.