ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీలింగ్స్' సాంగ్‌ను డిసెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్రోమో ద్వారా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 02:33 PM

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినీ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ 'పుష్ప‌-2: ది రూల్‌'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇక ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పోస్ట‌ర్లు, పాట‌లు 'పుష్ప‌-2'పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.   ఇలా ఎన్నో అంచనాలు నెల‌కొన్న ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ ఒక దాన్ని మించి మరొకటి హిట్ కాగా రీసెంట్ గా అయితే ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మలయాళ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ఆ పాటనే 'పీలింగ్స్'. అన్ని భాష‌ల్లోనూ ఈ సాంగ్‌ ప‌ల్ల‌వి లిరిక్స్ మ‌ల‌యాళంలోనే ఉండ‌నున్నాయి.దీంతో పక్కా మలయాళ బీట్స్ లో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ పాట‌ అక్కడే ఓ రేంజ్‌లో జనానికి ఎక్కేసింది. దాంతో ఈ పాట‌ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇపుడు సాలిడ్ ప్రోమోతో విడుద‌ల తేదీ వచ్చేసింది. ఈ మోస్ట్‌ అవైటెడ్ సాంగ్‌ను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి. ఇంకెందుకు ఆల‌స్యం... ఈ పాట ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com