నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది. తాజాగా మోక్షజ్ఞ న్యూలుక్ కు సంబంధించిన మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. 'యాక్షన్ కోసం సిద్ధమా?' అని ప్రశాంత్ వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. మోక్షజ్ఞ న్యూలుక్ పై నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రంపై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.