పుష్ప-2 ది రూల్... ఇప్పుడు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం త్వరలోనే వెండితెరపై చూడనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. కొచ్చిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ కూడా అక్కడ కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా ముంబయ్‌లో 'పుష్ప-2' హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ''ఈ సినిమా విషయంలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు... వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్ తడాని, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్.. పుష్ప చిత్రాన్ని కోవిడ్ టైమ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఫేస్ చేసి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నా టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు. నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్ సాంగ్ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్ మరోసారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది.