రష్మిక మందన్న మాట్లాడుతూ ''ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. పుష్ప ది రైజ్‌లో నాపై చిత్రీకరించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయడం అనగానే.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. చాలా నెర్వస్ అయ్యాను. కానీ ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నాను. లాట్ ఆఫ్ ఎమోషన్ష్ ఈ సినిమా చిత్రీకరణలో ఉన్నాయి. ఈ ఐదు సంవత్సరాల ప్రయాణం ఎంతో బాండింగ్ ఏర్పడింది. డిసెంబర్ 5న మా చిత్రం వస్తుందని గర్వంగా చెబుతున్నాను. సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడుతో పనిచేయడం ఎంతో ప్రౌడ్‌గా ఉంది. అతను మేధస్సు మనలా సాధారణ వ్యక్తి లా ఆలోచించడు. ఆయన సెపరేట్ సెవన్ ఇయర్స్ పుష్ప ఈజ్ మై హోమ్ లా అనిపించింది. ఇలాంటి గొప్ప టీమ్‌తో ఎన్ని సార్లు అయినా పనిచేయడానికి రెడీగా ఉంటాను' అన్నారు.