విభిన్న కథా చిత్రాలతో దక్షిణాదిన విశేష క్రేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ ‘బేబీ జాన్’ (Keerthy Suresh)తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరో. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ (Baby John Trailer)ను తాజాగా విడుదల చేసింది. ఈ క్రమంతో చిత్ర బృందం కీర్తి సురేష్ కొత్త సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, కీర్తి సురేష్‌తో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం తాజాగా మూవీ యూనిట్ వదిలిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.