మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుంది.బాహుబలి సిరీస్ తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపాయి. గత రెండు ఏళ్లలో ఆయన నుండి వచ్చిన ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాలు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనాలు అంతా ఇంతా కాదు. కల్కి చిత్రం 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, సలార్ చిత్రం 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాల తర్వాత ఆయన సెట్ చేసుకున్న కాంబినేషన్స్ ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. మరో 15 ఏళ్ళ వరకు ఇండియా లో ప్రభాస్ ని డామినేట్ చేసే మరో సూపర్ స్టార్ దొరకడం కష్టమే అన్నట్టుగా ఆయన లైనప్ ఉంది.
అలాంటి సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే తెలివైన హీరోయిన్లు ఎవరైనా వదులుకుంటారా?, ప్రభాస్ తో సినిమా అంటే గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరికి పరిచయం అయినట్టే. కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునే హీరోయిన్లు కూడా, ఉచితంగా చెయ్యాల్సి వచ్చినా ఏమాత్రం వెనకాడకుండా చేస్తారు. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఒక హీరోయిన్ ససేమీరా చెయ్యను అని ముఖం మీదనే చెప్పేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ అనే చిత్రం రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఇటీవలే సంప్రదించింది మూవీ టీం. కానీ ఆమె సందీప్ వంగ దర్శకత్వంలో నేను నటించలేని అని చెప్పి వెనక్కి పంపేసిందట.
ఎందుకంటే సందీప్ వంగ సినిమాల్లో రొమాన్స్ అయినా, వయొలెన్స్ అయినా చాలా వైల్డ్ గా, బోల్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్దమే కానీ, సందీప్ వంగ మార్కులో నటించడానికి నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళు అసలు ఊపుకోరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి లిమిటేషన్స్ పెట్టుకున్న తమన్నా, సమంత లాంటి వాళ్ళు ఇప్పుడు లిమిట్స్ అన్ని చెరిపేసి, నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. రేపు మృణాల్ ఠాకూర్ కూడా అదే లైన్ లోకి వెళ్లాల్సిందే. అప్పుడు వెళ్లే దానికంటే, ఇప్పుడే ఈ చిత్రం తో ఆడియన్స్ లోకి రావొచ్చు కదా. స్పిరిట్ చిత్రానికి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత స్టామినా ఉంది. మృణాల్ ఠాకూర్ ఒప్పుకొని చేసుంటే ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.