టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'సంక్రాంతికి వస్తున్నామ్' అనే ఒక ఉత్తేజకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జనవరి 14, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకీ, అనిల్, దిల్ రాజు త్రయం సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా సంక్రాంతికి వస్తున్నా సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పాజిటివ్ బజ్ ఇప్పుడు బుక్ మై షో ఇంప్రెషన్‌లలో ప్రతిబింబిస్తుంది. విడుదలకు దాదాపు ఐదు వారాలు మిగిలి ఉన్నందున సంక్రాంతికి వస్తున్నామ్ ప్రముఖ టిక్కెట్ ప్లాట్‌ఫారమ్‌లో 150K ఇంప్రెషన్స్ ని దాటింది. ఇది అభిమానులు మరియు సినీ ప్రేమికులలో భారీ అంచనాలను సూచిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన రమణ గోగుల, మధు ప్రియ పాడిన గోదారి గట్టు పాట ఇటీవల విడుదలై సెన్సషనల్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.