సెలబ్రిటీలు, అందాల తారల పెళ్లిళ్లు పెళ్లి ముచ్చట్టు హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. వారు కట్టుకున్న డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలు, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇలా ఒకటనేమిటీ ప్రతీదీ విశేషంగా వార్తల్లోనిలుస్తుంటాయి. ప్రస్తుతం మహానటి ఫేం, నటి కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు వైరల్‌గామారాయి. ఏంటా విశేషాలు తెలుసుకుందామా..! 15 ఏళ్ల సుదీర్ఘ స్నేహం తర్వాత, ప్రియుడు ఆంటోనీ తటిల్‌తో ఈనెల 12న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయ్యంగార్, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు గురించి మాట్టాడుకుంటే.. పసుపు , ఆకు పచ్చ రంగుల కాబినేషన్‌లో ఉన్న చీరలో కొత్త పెళ్లికూతురిగా అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైనర్ ఆంటోనీ అనితా డోంగ్రే ఈ చీర విశేషాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇక కీర్తి సురేష్ రెడ్-టోన్డ్ వెడ్డింగ్ చీర ఆమె తల్లిదట దీనికి మ్యాచింగ్ బ్లౌజ్‌ను డిజైన్ చేసినట్టు అనితా వెల్లడించారు. అమ్మచీర , కొంగుపై తమిళ పద్యం తొమ్మిది గజాల, అయ్యంగార్ (మడిసర్) స్టయిల్‌లో తన తల్లి చీరలో కీర్తి సురేష్ స్పెషల్‌గా కనిపించింది. ఈ పెళ్లి చీర మేకింగ్ వీడియోను అనితా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కంజీవరం చీరపై తమిళ పద్యాన్ని చేతితో అందంగా పొందరుపర్చారు. అదీ స్వయంగా కీర్తి చీర అంచులు, పల్లులో స్వయంగా తన చేతితో అక్షరాలను తీర్చిదిద్దడం విశేషం. తయారీకి 405 గంటలు ఇంకా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన బంగారు జరీ డైమండ్ సూది ఉన్నాయని అనితా డోంగ్రే వెల్లడించారు.అంతేకాదు దీని తయారీకి సుమారు 405 గంటలు పట్టింది. సంప్రదాయ నేత కళను, ఫ్యాషన్ సంస్కృతిని ప్రతిబింబించేలా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు డిజైనర్లు. పెళ్లిలో ఆమె భరతనాట్య ఆభరణాలను ఎంచుకుంది. నెక్లెస్‌లు అట్టికై , హారం, మాంగ టిక్కా లేదా నెట్టి చుట్టి, ఒడ్డాణం, ఇరుచెంపలకు సూర్య , చంద్ర ఇలా సంప్రదాయ ఆభరణాలతో రాయల్ లుక్‌లో మెరిసింది.