స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తుల వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్‌లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం. వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.