టాలీవుడ్ సమస్యలను వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముందు సినీ పెద్దలు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు.హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తే... తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని ప్రతిపాదించారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండాలని చెప్పారు. యూనివర్సల్ లెవెల్ లో స్టూడియో సెటప్ ఉండాలని అన్నారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల మద్దతుతో సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకముందని తెలిపారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేపిటల్ కావాలని ఆకాంక్షించారు