మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యునిక్ సంగీత దర్శకుడు అలాగే యునిక్ గొంతు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా రమణ గోగుల అని చెప్పొచ్చు. మెయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి సాలిడ్ మ్యూజిక్ అందించి హైలైట్ అయ్యిన తాను ఇతర స్టార్స్ కి కూడా మంచి బీట్స్ ని తన వోకల్స్ లో పాటల్ని అందించారు అని చెప్పాలి. అయితే చాలా కాలం నుంచి రమణ గోగుల కొత్త పాటలు లేవు తన సంగీతం కూడా లేదు.కానీ ఫైనల్ గా “సంక్రాంతికి వస్తున్నాం” మేకర్స్ రమణ గోగులని ఓ స్పెషల్ సాంగ్ తో తీసుకొచ్చారని చెప్పాలి. వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ లతో దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేసిన ఈ పక్కా ఎంటర్టైనర్ నుంచి ఫస్ట్ సింగిల్ గా టీజ్ చేస్తూ వచ్చిన గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యింది. వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సాలిడ్ రికార్డు వెంకీ మామ కెరీర్ లో సెట్ చేసింది. ఇలా మొత్తానికి మాత్రం భీమ్స్ సంగీతంలో రమణ గోగుల ఇచ్చిన కంబ్యాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పి తీరాలి.