ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 04:19 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ ను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్. కొన్నాళ్లుగా ఈ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మహేష్ బాబు. అలాగే తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


తాజాగా ఇప్పుడు ఈ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ లో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో నటి పేరు తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ లో టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ లో హీరోతోపాటు హీరోయిన్ పాత్రకు సైతం ప్రాధాన్యత ఉంటుందని..ఆ పాత్రకు ఆమె న్యాయం చేయగలదని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర కోసం ఇప్పటికే ప్రీపరేషన్ స్టార్ట్ చేశారట.ఇక ఈ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ లో ప్రియాంక పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌లో కనిపించనుందని అంటున్నారు. ఈ లోని కొన్ని సన్నివేశాలను ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నారు. ఈ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించనున్నాడని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com