రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో ఇప్పటికే భారీ కటౌట్ సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని.. ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశామని.. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్రబృందానికి సంబంధించిన పలువురు సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్‌రాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.