గతం వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వీడియో తెగ ఊపేస్తుంది. అది పుష్ప2 సాంగ్ మేకింగ్‌కి సంబంధించిన వీడియో. అందులో అల్లు అర్జున్ పక్కన పింక్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఓ యువతి మెస్మరైజింగ్ లుక్స్‌తో..మెరుపు తీగలా మూమెంట్స్‌తో అదరగొట్టింది. కిస్సిక్ సాంగ్ మేకింగ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌తో కలిసి ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో నెటిజన్లకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో ఎవరీ అమ్మాయి? ఇన్‌స్టా ఐడీ ఇస్తే లైఫ్ ఇస్తాం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మనవాళ్లు ఆగుతారా చెప్పండి.. ఆమె ఇన్ స్టా ఐడీతో పాటు పుట్టుపూర్వోత్తరాలు కనిపెట్టేశారు.ఈ వీడియోలో బన్నీ పక్కన డ్యాన్స్ చేసిన అమ్మాయి పేరు ఊర్వశి అప్సర. ఈమె పుష్ప 2 చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. థియేటర్లో ఓ ఊపు ఊపేస్తున్న కిస్సిక్ సాంగ్‌కి ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అంటే సాంగ్ కొరియోగ్రఫి చేసిన గణేశ్ ఆచార్య మాస్టర్ వద్ద తను అసిస్టెంట్‌గా చేస్తోంది. ఇప్పుడు కొత్తేం కాదు… పుష్ప చిత్రంలోని 'ఊ అంటావా మావా' పాటకి కూడా ఈమె వర్క్ చేసింది. ఊర్వశీ బెల్లి డ్యాన్స్‌లో ఎక్స్‌పర్ట్. అంతేకాదు.. యోగా ట్రైనర్ కూడా. నటిగా కూడా పలు ల్లో మెరిసింది. '31 డిసెంబర్', 'కిట్టి పార్టీ', 'అనంత్', 'పింటు కి పప్పి' వంటి మూవీస్‌లో నటించింది. చాలామంది సెలబ్రెటీలతో పనిచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకారుకు సెగలు రేపుతోంది ఈ బ్యూటీ.
ఇప్పటివరకూ మన వాళ్లకు ఈమె గురించి పెద్దగా తెలియదు. కానీ బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమె పేరు మారుమోగిపోతుంది. ఆమె వీడియో చూసిన కొందరు.. అసలు ఈమెతోనే ఆ కిస్సిక్ సాంగ్ చేయిస్తే నెక్ట్స్ లెవల్ కదా అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక్క మేకింగ్ వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేలెండి. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతాడో మనం చెప్పలేం కదా.