టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన "మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది" అని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, తన మొదటి చిత్రం 'రాజావారు రాణివారు'లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa