ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దబిడి దిబిడి ఫుల్ వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 09:34 PM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో భారీ వసూళ్లతో దుమ్ములేపింది.ఈ సినిమా నుంచి ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని ‘దబిడి దిబిడి’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటను జనవరి 27న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పాటలో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా అదిరిపోయే మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com