ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విడుదల కానున్న ‘ప్రేమిస్తావా’ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 09:46 AM

ఆకాశ్‌ మురళి, అదితి శంకర్‌ జంటగా విష్ణువర్ధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమిస్తావా’. తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై చక్కటి ప్రజాధరణ పొందింది. ఈ గురువారం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, గొడవల నేపథ్యంలో సాగిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ ‘నేటి సమాజంలో ప్రేమలు, అనుబంధాలు ఎలా ఉన్నాయనేది ఈ సినిమా చూపిస్తుంది. అదితి, ఆకాశ్‌ చక్కగా నటించారు’ అని అన్నారు. ‘ఇది నా ఫస్ట్‌ లవ్‌స్టోరీ. లవ్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని అదితి చెప్పారు. విష్ణువర్ధన్‌ స్టైలిష్‌ మేకింగ్‌ ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ అని ఆకాశ్‌ మురళి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa