డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ గోపాల్‌వర్మ శిష్యుడన్న సంగతి తెలిసిందే. చాలా కాలానికి తన శిష్యుడు పూరి హిట్ కొట్టడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు వర్మ రూల్స్ ను బ్రేక్ చేస్తూ తన శిష్యులతో కలిసి బైక్ పై నగర రోడ్లపై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ట్వీట్ చేస్తూ.. ఫోటోను షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వర్మ చాలెంజ్ విసిరాడని, మూడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని.. నో హెల్మెట్, త్రిబుల్ రైడిండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు బండి యజమాని బద్దె దిలీప్ కుమార్ కు 1300రూపాయలు చలానా రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa