ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు గారికి ధన్యవాదాలు: స్మిత

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2019, 09:23 PM

టాలీవుడ్ ప్రముఖ గాయని స్మిత.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో స్మిత ఒకే ఒక్క ‘ఇండిపాప్‌’ కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ‘పాడుతా తీయగా’ కోసం 1996లో తొలిసారి మైక్‌ పట్టుకున్నక్షణం నుంచి ఇప్పటికీ అదే ఉత్సాహంతో పాడుతూ సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారు. 1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్మిత.. 2019తో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాగా.. తన సంగీత ప్రయాణం 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో వేడుక నిర్వహించ బోతున్నారు. 
20 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తయిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్మితకు అభినందనలు తెలిపారు. తాజా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్మితకు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు అద్భుతంగా ఆహ్లాదం కలిగిస్తున్నందుకు అభినందలు తెలియజేశారు. తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని, నర్తకిగా గుర్తింపు పొందిన స్మిత వల్లూరుపల్లి తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బమ్ రూపొందించడం గర్వకారణమన్నారు.
ఇందుకు ట్విట్టర్ వేదికగా స్మిత రియాక్ట్ అయ్యారు. ‘ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే సందర్భం. నాకు విష్ చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు’ అని బాబుకు ట్యాగ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa