బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పుష్కరకాల ప్రయాణం తమన్నాది. మెరుపుతీగలా ఉండే ఈ మిల్క్ బ్యూటీ…తొలి చిత్రం నుంచీ అదే ఆకృతిని కాపాడుకుంటోంది. ఈ సుందరిని చూద్దామన్నా బొద్దుగా కనిపించిన సందర్భాలు లేవు. 2005 లో ‘చాంద్ స రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా…అతి తక్కువ కాలంలో తమిళం, తెలుగులో పేరున్న నటి అయ్యింది. బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర తారగా కెరీర్ కొనసాగిస్తోంది. గతేడాది ఏడు చిత్రాల్లో నటించింది. ఈ వేసవిలో బాహుబలి రెండో భాగంలో ప్రేక్షకులకు కనిపించింది. ఇక ప్రస్తుతం అలాంటి భారీ చిత్రాల్లో నటించకున్నా…తగుమాత్రం తీరిక లేకుండానే ఉంటోంది. తమన్నా చేస్తున్న చిత్రాల్లో తెలుగులో ‘క్వీన్’ ఆసక్తి కలిగిస్తోంది.
ఈ చిత్రంలో నటించడం తనకెంతో సంతోషాన్నిస్తోందన్న తమన్నా…పాత్రలో తనదైన ముద్ర వేస్తానని చెప్పింది. చెప్పినట్లుగానే రెట్టింపు కసరత్తులు చేస్తూ…మరింత మెరుపు తీగలా తయారవుతోంది. ఈ విషయాన్ని తమన్నా తెలుపుతూ…’నేను వ్యాయామం చేయకుండా ఉండలేను. నటి అయ్యాక ఏ రోజూ కసరత్తులు తప్పించలేదు. సాధారణంగా వారంలో మూడు రోజులు జిమ్‌కు వెళ్తాను. క్వీన్ పాత్ర కోసం ఆరు రోజులు వ్యాయామం చేస్తున్నాను. ఈ పాత్ర కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాను.’అని చెప్పింది. అయితే తమన్నా బరువు తగ్గడం వెనుక ఆమె అభిమానులు నొచ్చుకుంటున్నారు. అసలే మెరుపు తీగ మరింత తగ్గాలా..? అని వాపోతున్నారు. ప్రస్తుతం ‘క్వీన్’ సినిమా చిత్రీకరణలో భాగంగా తమన్నా పారిస్ వెళ్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa