వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న టైం లో రామ్ కు నేను శైలజ చిత్రం వచ్చి మళ్లీ తన కెరియర్ ను నిలబెట్టింది. ఈ సినిమా తో మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ టాలీవు కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే అమ్మడు తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చింది. అంతే రామ్ – కీర్తి జోడి కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం కీర్తి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తో పాటు మహానటి మూవీ లో నటిస్తుంది.తాజాగా మరోసారి హీరో రామ్ తో జోడి కట్టబోతుందని తెలుస్తుంది. రామ్ హీరోగా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సినిమా తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవడానికి రాజు ఫిక్స్ అయ్యాడట. గతం లో రాజు , నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్ కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యం లో మరోసారి కీర్తి తో వర్క్ చేయాలనీ దర్శక , నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసురాబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa