by Suryaa Desk | Thu, Dec 19, 2024, 03:44 PM
అల్లరి' నరేశ్ కథానాయకుడిగా... ఆయన తాజా చిత్రంగా 'బచ్చల మల్లి' రూపొందింది. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా అమృత అయ్యర్ కనిపించనుంది. రేపు థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో అల్లరి 'నరేశ్' బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "మా సొంత బ్యానర్ పై సినిమాలు చేయకపోవడం గురించి అంతా అడుగుతున్నారు. ఈవీవీ బ్యానర్ పై సినిమా అనేసరికి కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అంతా ఊహిస్తారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్ లో కామెడీ కంటెంట్ ను డీల్ చేయడం కష్టమే. కొత్తగా వచ్చిన దర్శకులు నలుగురైదుగురు కమెడియన్స్ ను డీల్ చేయడానికే కంగారు పడిపోతున్నారు. 'ఎవడిగోల వాడిది' సినిమా 40 మంది కమెడియన్స్ తో నడిచింది" అని అన్నాడు. "మంచి కంటెంట్ కావాలంటే రైటర్స్ ను ప్రోత్సహించాలి. కానీ రైటర్స్ కి సరైన గుర్తింపు... ఒక మంచి పేమెంట్ ఇవ్వడం లేదనేది నా అభిప్రాయం. కథ కోసం ఖర్చు పెట్టండి... రైటర్ పై ఖర్చు పెట్టండి అనే నేను చెబుతూ ఉంటాను. ఇండస్ట్రీకి ఇప్పుడు రైటర్స్ చాలా అవసరం. అందువలన వాళ్లను ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది" అని చెప్పాడు.
Latest News