మధిర పట్టణంలోని మదర్ థెరిస్సా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక దివ్యాంగుల కేంద్రంకు మంగళవారం మధిర పట్టణానికి చెందిన పలువురు దాతలు బియ్యం, నిత్యావసర సరుకులను వితరణగా అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా సేవా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో స్పందించి మానసిక దివ్యాంగుల కేంద్రానికి అండగా నిలిచిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa