వేసవి తాపాన్ని తట్టుకొనుటకు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుటకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశానుసారం శనివారం బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఉపాధి హామీ దినసరి కూలీలకు ఓ ఆర్ ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు. లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ బి. ఆలోచన మాట్లాడుతూ కూలీలు ఉదయం పూట ఎండ తీవ్రత లేనప్పుడే పనిలో ఉండాలని, మధ్యాహ్న సమయం ఎండ తీవ్రత ఉన్నప్పుడు శరీరానికి విశ్రాంతి కలిగించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa