వినాయక్ నగర్ డివిజన్ కు చెందిన సంజయ్ కు సీఎం సహాయ నిధి కింద మంజూరైన ఎల్ ఓ సిని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రూ. 1. 50 లక్షల విలువ గలఎల్ ఓ సిని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒకరు కార్పొరేట్ వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa