ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆర్డీవో రంగనాథ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి, అడ్లూరు గ్రామంలో ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ధాన్యం తరలింపుకు ఆలస్యం అవుతుందన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రైతులెవరు అధైర్య పడవద్దు అని తెలిపారు. తహసీల్దార్, సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa