నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో అదనపు తరగతుల నిర్మాణం కోసం గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనిల్ గౌడ్, మాజీ ఎంపీపీలు చంద్రకాంత్ గౌడ్, గడ్డంపల్లి హనుమంతు, నాయకులు గణేష్ కుమార్, రవికుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa