చికిత్స పొందుతూ అటవీశాఖ విశ్రాంత రేంజ్ అధికారి గంగుల నాగగౌడ్(65) మృతి చెందారు. నాగగౌడ్ మంగళవారం నడకకు వెళ్లి తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఓ కారు ఢీకొట్టింది. అతని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి ఇద్దరు కొడుకులు, కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa