జనగాంలో వీధి కుక్కలు ఎక్కువ కావడం పట్ల జనగాం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కుక్కలు ఎక్కువగా ఉండటంతో న్యాయవాదులకు, కక్షదారులకు, కోర్టులో పనిచేసే సిబ్బందికి కుక్కల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa