హైదరాబాద్ నగరంలో అందరినీ అవాక్కయ్యేలా చేసిన విస్కీ ఐస్‌క్రీమ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న అరికో కేఫ్‌లోని.. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో.. విస్కీ ఐస్‌క్రీమ్‌లు పట్టుబడ్డట్టూ హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్టు.. సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఈ '1 అండ్ 5' పార్లర్ నిర్వాహకులైన దయాకర్ రెడ్డి, శోభన్‌లను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే.. ఈ కేసులో దిమ్మదిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే.. అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రా రెడ్డి.. సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసుల మీద చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది.
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. తనను రూ.25 వేలు లంచం అడిగారని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రా రెడ్డి ఆరోపించారు. వాళ్లు అడిగిన లంచం ఇవ్వకపోవడంతో ఎలాగైనా తనను ఇరికించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి కేసులో ఇరికించాలని చూశారని శరత్ చంద్రా రెడ్డి ఆరోపించారు.
అయితే.. డెకాయ్ ద్వారా పదకొండున్నర కిలోల కేక్‌ను ఎక్సైజ్ పోలీసులు ఆర్డర్ చేశారని.. ఆన్‌లైన్ ద్వారానే నగదు కూడా పంపించారని శరత్ తెలిపారు. విస్కీ బాటిల్ కొనుక్కొచ్చి.. ఆ కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు అధికారులు చెప్పారని.. కాని అందుకు దయాకర్ కుదరదని చెప్పినట్టు వివరించారు. దీంతో.. వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు కేఫ్ లోపలికి తీసుకొచ్చి.. సోదాలు చేసినట్టు డ్రామాలు ఆడినట్టు అధికారులపై శరత్ చంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక.. ఇదే విషయాన్ని శరత్ చంద్రా రెడ్డి.. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం.
హైదరాబాద్ ప్రజలను ఉలిక్కపడేలా చేసిన విస్కీ ఐస్‌క్రీమ్ కేసులో ఇలాంటి మలుపు తీసుకోవటంతో.. అందరూ అవాక్కవుతున్నారు. అయితే.. ఎక్సైజ్ అధికారులపై శరత్ చంద్రా రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతా అన్నది మాత్రం అధికారులే తేల్చాల్సిన పరిస్థితి. అటు అధికారులు చెప్పిన విస్కీ ఐస్‌క్రీమ్ నిజమా.. లేదా అధికారులే విస్కీ కలపటం నిజమా అన్నది విచారణలో వెల్లడవనుంది.
అయితే.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో.. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గంజాయినైతే.. రకరకాలుగా అమ్మేస్తున్నారు. కిరాణా దుకాణాల్లో ఈ గంజాయి చాక్లెట్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు. అసలు విషయం తెలియక.. స్కూల్ విద్యార్థులు వాటిని కొనుక్కుని తింటుండటంతో.. వాళ్లకు తెలియకుండానే ఆ చాక్లెట్లకు అలవాటుపడిపోతున్నారు. ఇలాంటి పలు ఘటనలు ఇప్పటికే నగరంలో వెలుగులోకి వచ్చాయి. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న మహిళలను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు.. సిగరెట్ల రూపంలోనూ ఈ గంజాయిని పెట్టి గుట్టుగా అమ్ముతున్నారు. ఇటీవలే.. పసుపు ప్యాకెట్ల ముసుగులో గంజాయిని పెట్టి అమ్మేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa