ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 08:45 PM

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించింది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా ఈ ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనుంది.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పర్యాయాలు సమావేశమైన ఈ కమిటీ... ఎస్సీ రిజర్వ్‌డ్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం షమీమ్ అక్తర్‌ను నియమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa