సంతాన సమస్యలతో బాధపడేవారికి ఫెర్టిలిటీ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ లో డాక్టర్ రమేష్, డాక్టర్ రూపాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ రూపాస్ ఉమెన్స్ హెల్త్ & ఫెర్టిలిటీ సెంటర్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృత్వం లేని తల్లిదండ్రులకు ఫెర్టిలిటీ సెంటర్లు సంతాన ప్రాప్తిని కలిగిస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాసు వెంకటేష్, సంధ్యా హన్మంతు రావు, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa