కోదాడ డివిజన్లోని చిలుకూరు గ్రామంలో జరుగుతున్న సోషల్ ఎకనామిక్ సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ చిలుకూరు గ్రామంలోని 38/బి బ్లాక్ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ప్రభుత్వం సూచన మేరకు ఫామ్ ను జాగ్రత్తగా నింపాలని ప్రజలు సహకరిస్తే సర్వేకు వచ్చిన అధికారులకు సులభతరం అవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.
కోదాడ డివిజన్ లోని చిలుకూరు గ్రామంలో సుజాత ఇంటి వద్ద జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ని కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్స్ నింపుతున్న ఫామ్ లో కలెక్టర్ పరిశీలించారు. ఫామ్ ను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా పోలింగ్ బూతులు 113, 115 లో బిఎల్వోలు స్వీకరిస్తున్న ఫామ్ 6,7, లను పరిశీలించారు. నూతన ఓటర్స్ 9 ,10 తేదీలలో జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా జరిగే ఓటర్ల నమోదు ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ ఎంపీడీవో ఎంపీవో సూపర్వైజర్లు,ఎన్యుమరెటర్స్, పాల్గొన్నారు.