అందోలు మండలంలోని డాకూరు, సంగుపేట, ఎర్రారం గ్రామాల్లో సామాజిక ఆర్ధిక రాజకీయ సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న సామాజిక ఆర్ధిక రాజకీయ సమగ్ర కుల గణన కార్యక్రమం ను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేసారు. ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమం లో ఏలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.
కుల గణన సర్వేలో భాగంగా ఉన్న ప్రశ్నలకు సంబంధించి ప్రజలు సమాధానాలు ఇవ్వాలన్నారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సర్వే ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సర్వే నిమిత్తం వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరించాలని సూచించారు. ఎంపిడిఓ రాజేష్ కుమార్, యం పి ఓ అశోక్ పంచాయితీ కార్యదర్శి సాయి లీలలు పాల్గొన్నారు.