వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాటుపై పోలీసులు దాడిచేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రమంజిల్ నుంచి తాజ్‌కృష్ణా హోటల్ కు వెళ్లే మార్గంలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో వ్యభిచారం నడుస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.వారిని ఖైరతాబాద్ పోలీసులకు అప్పగించడంతో విచారించిన పోలీసులు ప్రధాన నిందితుడైన జి.నరసింహులునాయుడుతో పాటు సహ నిర్వాహకురాలు డి.బూరమ్మ అలియాస్ రుతమ్మ(64), ఓ విటుడిని, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదు, కండోమ్స్‌తో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి కేసును విచారించారు.