ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్బంగా శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి రైతులను, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేట డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేశారని అన్నారు.