మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏఎంసీ కృష్ణ కాలనీకి చెందిన గుడిసెల రోహిణి (22)కి గత ఆగస్టులో వివాహం జరిగింది.
కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఏఎంసీలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిన రోహిణి సోమవారం ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa