మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో మేకల కాపరి మల్లేష్ కు చెందిన ఐదు మేకలు మంగళవారం తెల్లవారుజామున చోరీకి గురైనట్లు సీఐ జగదీష్ చెప్పారు. బాధితుడు సోమవారం తనకున్న 11 మేకలు,
మూడు చిన్న పిల్లలను పొలానికి తీసుకెళ్లి మేపుకొని వచ్చి సాయంత్రం ఇంటి ఆవరణలో ఉన్నషెడ్డులో కట్టి వేసి మంగళవారం తెల్లవారు జామున వెళ్లి చూడగా అందులో నుండి 5 మేకలు కనిపించలేదని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.