తెలంగాణలో సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశముంది. అయితే ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa