ములుగు జిల్లాలో మినీ మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ జాతర ఈ నెల 15 వరకు జరుగుతుంది. కాగా, ప్రతి రెండేళ్లకోసారి మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.బుధవారం రాత్రి పూజారులు సమ్మక్క పూజ మందిరం నుంచి పసుపు, కుంకుమ, నైవేధ్యం తీసుకువచ్చి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద సమర్పించారు.డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాల నడుమ మహిళలు నీళ్లు ఆరబోస్తుండగా వడ్డెలు (పూజారులు) గద్దెల వద్దకు చేరుకొని జాగారం చేశారు.మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa