విద్యార్థుల విద్య వసతుల పట్ల నిర్లక్ష్యం సహించేది లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆత్మకూరు మండలం పెద్దాపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ( బాలికలు) గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్ పరిసరాలను, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో ముఖాముఖి సంభాషించారు. రానున్న పదో తరగతి పరీక్షలు ఏకాగ్రతతో కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంలో జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న టెన్త్ బోర్డు ఎగ్జామ్ లో వంద శాతం రిజల్ట్ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పరకాల ఆర్డీవో నారాయణ, ఆత్మకూర్ ఎమ్మార్వో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa