దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో లైన్ నిర్మాణం జరుగుతుండగా శుక్రవారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నామని, ఇంకొన్ని దారి మళ్లిస్తామని అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, శుక్రవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈమేరకు ప్రయాణికులు గమనించాలని ఖమ్మం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa