తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా TGPSC, పోలీసు, గురుకుల, వైద్య, నియామక సంస్థల ద్వారా నియామకాల భర్తీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయగా, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ ముగిసే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వబోమని చెప్పింది.ఈ కారణంగానే గత ఏడాది సెప్టెంబరు నుంచి నియామక ప్రకటనలు రాలేదు. ఇక ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి రావడంతో ఇప్పుడు సర్కారు మళ్లీ ఉద్యోగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను షురూ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa