ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన రూ. 58,000 విలువైన చెక్కును ఆయిల్లా పోశయ్యకు అందజేశారు. ఈ చెక్కును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు ఆదేశాల మేరకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు గణేష్, గ్రామ అధ్యక్షుడు కే. సాయిలు, గ్రామ యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అవసరమైన వారికి అందించేందుకు ప్రభుత్వ నిర్ణయాలను కార్యరూపంలోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa