పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రైతు గుగులోతు కిషన్ (51) వడదెబ్బ బారినపడి మరణించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరబెడుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వడ్ల కుప్పపై పని చేస్తుండగా కిషన్ ఒక్కసారిగా అస్వస్థతకు లోనై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సకాలంలో వైద్యం అందక, ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రైతుల మధ్య తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది.
కేంద్రంలో నీడకు టెంట్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడమే ఈ మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండల అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక రైతులు మరియు కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని తగిన సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా పెరిగిన ఉష్ణోగ్రతల మధ్య రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa