నాగిరెడ్డి పేట్ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, శుక్రవారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేసి, ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, "ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే నా లక్ష్యం" అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa