కామారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే రోగికి అత్యవసర ఆపరేషన్ కోసం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది.
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితిని సంప్రదించగా, కామారెడ్డి పట్టణానికి చెందిన చీల గోపి శుక్రవారం ఓ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. ఈ సేవకు గాను జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ రక్తదాత చీల గోపికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa