కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి, నల్లగండ్లలో పరమపవిత్రంగా శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేకంగా ఆహ్వానించగా, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మధ్య ఆధ్యాత్మికత నిండిన వాతావరణం నెలకొంది. భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దివ్య దర్శనం పొందారు. స్థానికంగా ఈ ఉత్సవం ఉల్లాసభరితంగా జరగడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa